ఇళ్ల గుర్తింపు, లిస్టింగ్ పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 08 , 2024 | 11:41 PM
జిల్లాలో నిర్వహి స్తున్న సమగ్ర ఇంటింటి లిస్టింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారు లను ఆదేశించారు.
గద్వాల టౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నిర్వహి స్తున్న సమగ్ర ఇంటింటి లిస్టింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారు లను ఆదేశించారు. పట్టణంలోని కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న ఇంటి ంటి సర్వే స్టిక్కర్ అతికించే పను లను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు? ఇంకా ఎన్నింటికి వేయాల్సి ఉందనే వివరాలను ముని సిపల్ మేనేజర్ మ్యాప్ ద్వారా కలెక్టర్‌కు వివ రించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు, సూ పర్‌వైజర్లతో మాట్లాడిన కలెక్టర్, సర్వేకు అవస రమైన ఫారాలు, ఇతర సామగ్రి, తదితర వాటి గురించి స్పష్టంగా వివరించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మల్లికార్జున్, మునిసిపల్ మేనేజర్ ఎల్లారెడ్డి ఉన్నారు.
ప్రతీ ఇంటికి స్టిక్కర్లు అతికించాలి
రాజోలి: తమకు కేటాయించిన పరిధిలో నివాసం ఉన్న ప్రతి ఇంటికీ స్టిక్కర్ అతికించి, సర్వే చేయాలని మండల ప్రత్యేక అధికారి శ్రీని వాసులు ఇన్యుమరేటర్లకు సూచించారు. మండ ల కేంద్రంలోని కోట వీధిలో నిర్వహిస్తున్న సర్వే ను ఆయన పరిశీలించారు. అనంతరం రాజోలి పంచాయతీ కార్యాలయం వద్ద సమస్యలపై ఆయన సూచనలు, సలహాలు అందించారు.