Share News

డబుల్‌ ఓట్లు ఉంటే తొలగించాలి

ABN , Publish Date - Nov 10 , 2024 | 11:36 PM

ఓటర్ల జాబితా ప్రత్యేక సవ రణ కార్యక్రమం 2025లో భాగంగా ప్రతీపోలింగ్‌ బూత్‌ పరిధిలో డబుల్‌ ఓట్లు ఉంటే తనిఖీ చేసి తొలగించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించా రు.

డబుల్‌ ఓట్లు ఉంటే తొలగించాలి

వనపర్తి రూరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సవ రణ కార్యక్రమం 2025లో భాగంగా ప్రతీపోలింగ్‌ బూత్‌ పరిధిలో డబుల్‌ ఓట్లు ఉంటే తనిఖీ చేసి తొలగించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలి కల పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌ను కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డారు. ఓటరు జాబితాలో డబుల్‌ ఓట్లు ఉంటే వాటిని ఫారం 7 ద్వారా తొలగించాలని, మార్పు లు ఏమైనా ఉంటే ఫారం 8 ద్వారా చేయాలని సూచించారు. అన్ని పోలింగ్‌ బూత్‌లో ఓటరు జాబితాలను తప్పక ప్రదర్శించాలని బీఎల్‌వోల ను ఆదేశించారు. 1-1-2025 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఎవరైనా కొత్తగా ఓటరుగా న మోదు చేసుకోవాలనుకుంటే ఫారం 6 ద్వారా ద రఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం బీఎల్‌వోలు ప్రస్తుతం అందుబాటులో ఉంటారని, ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ఎవరైనా ఓటర్లు మృతిచెందితే వారిని జా బితా నుంచి తొలగించాలని సూచించారు.

ఇంటింటి సర్వే సమగ్రంగా చేయాలి

సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మునిసి పాలిటీలోని బండారు నగర్‌లో ఎన్యుమరేటర్లు సర్వే చేస్తున్న తీరును కలెక్టర్‌ పరిశీలించారు. సూపర్‌వైజర్లు ఎన్యుమరేటర్లకు పర్యవేక్షణ చే యాలన్నారు. కుటుంబ వివరాల జాబితాలో ఎ లాంటి తప్పులు లేకుండా ఎన్యుమరేటర్లు వివరా లు నమోదు చేయాలన్నారు. ప్రజలు కూడా స ర్వే సిబ్బందికి కావాల్సిన సమాచారాన్ని అందించ డంలో సహకరించాలన్నారు. ఆర్డీవో సుబ్రహ్మ ణ్యం, తహసీల్దార్‌ రమేష్‌ రెడ్డి, పూర్ణచందర్‌, బీఎల్‌వోలు, ఎన్యుమరేటర్లు వెంట ఉన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 11:36 PM