అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:30 PM
మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి తెలిపారు.
- అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తాం
- ఎమ్మెల్యే మేఘారెడ్డి
ఖిల్లాఘణపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి తెలిపారు. మండలంలోని అల్లమాయపల్లిలో బుధవారం సేవాలాల్ కమ్యూనిటీ భవన నిర్మా ణానికి భూమి పూజ, అప్పారెడ్డిపల్లిలో 24 మం ది లబ్ధిదారులకు బీసీలకు ప్లాట్ల పంపిణీ, సల్కెలాపూర్‌లో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ, మండల కేంద్రంలో అటవీశాఖ కార్యాలయం, అటవీ శాఖ రేంజర్ నివాస గృహం, దొంతికుంటతండాలో సేవాలాల్ కమ్యూ నిటీహాల్ భవనం నిర్మాణం చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంద ర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరు స్తుందని తెలిపారు. గ్రామంలో కొత్త కాలనీకి తాగునీటి సౌకర్యం ఇబ్బంది ఉన్న నేపథ్యంలో కొత్తగా మిషన్ భగీరథ పైపులైన్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబా నికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ ము రళీధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ క్యామరాజు, సాయి చరణ్ రెడ్డి, విజయ్‌కుమార్, శ్యాంసుందర్‌రెడ్డి, కృష్ణయ్యయాదవ్, రాములునాయక్ పాల్గొన్నారు.