Share News

రాష్ట్రంలో అసమర్థ పాలన

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:51 PM

రాష్ట్రంలో అసమర్థ పాలన న డుస్తోందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో అసమర్థ పాలన
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి అర్బన్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసమర్థ పాలన న డుస్తోందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి పట్టణం లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ... పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్త యిందని, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అయినా పది శాతం పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. యాసంగికి సాగునీళ్లు లేవని చెప్పడం ఈ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల అవివేకమన్నారు. ఈ ఏడాది 35 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయని, దాదాపు 25 నుంచి 30 టీఎం సీల నీరు సముద్రం పాలైందని తెలిపారు. నీటిని ఎలా ఒడిసి పట్టాలో తెలియక, యాసంగి సీజన్‌కు నీళ్లు లేవని ఇరిగేషన్‌ సమావేశం పెట్టకుండా ఒక డిప్యూటీ ఇంజనీరుతో ప్రకటన చేయించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ ఎస్‌ నాయకులు లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్‌, కురుమూర్తి, మాణిక్యం పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:51 PM