రోడ్లను ఊడ్చి వినూత్న నిరసన
ABN , Publish Date - Dec 26 , 2024 | 11:21 PM
డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు 17వ రోజు గురువారం రాజీవ్‌మా ర్గ్‌లో పొరకలు చేతబట్టి రోడ్లను ఊడ్చుతూ వి నూత్న రీతిలో నిరసన తెలిపారు.
గద్వాల టౌన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు 17వ రోజు గురువారం రాజీవ్‌మా ర్గ్‌లో పొరకలు చేతబట్టి రోడ్లను ఊడ్చుతూ వి నూత్న రీతిలో నిరసన తెలిపారు. ఉద్యోగుల స మ్మెతో విద్యాశాఖలో స్తబ్ధత ఏర్పడిందని శిబిరం వద్దకు వచ్చిన రిటైర్డ్ ఎంఈవో స్వామి అన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వా న్ని కోరారు. అలాగే జిల్లాలోని పలు ఉన్నత, ప్రా థమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా కొద్దిసేపు నిరసన తెలిపారు. దీక్షలో జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హుసేనప్ప, గోపాల్, మహిళా అధ్యక్షురాలు ప్రణీ త, గద్వాల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు.