సీఎం సభా స్థలం పరిశీలన
ABN , Publish Date - Nov 23 , 2024 | 11:28 PM
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈనెల 30న ప్రజా పాలన విజయోత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లాకు రానున్నారు. దాంతో సభా స్థలాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు శనివారం పరిశీలించారు.
ఈ నెల 30న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం, కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్/భూత్పూర్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈనెల 30న ప్రజా పాలన విజయోత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లాకు రానున్నారు. దాంతో సభా స్థలాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు శనివారం పరిశీలించారు. ఈ నెల 11న కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం మరోసారి జిల్లాకు రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పాలమూరులో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణ చేసి, బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. తేదీ దాదాపుగా ఖరారుకాగా, సమయం ఇంకా ఫైనల్ కాలేదని పార్టీ శ్రేణులు తెలిపాయి. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, కలెక్టర్ విజయేందిరబోయి సభ కోసం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంతోపాటు భూత్పూర్ పురపాలిక పరిధిలోని అమిస్తాపూర్ శివారులో స్థలాలను పరిశీలించారు. అమిస్తాపూర్‌లోనే సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అక్కడ వాహనాల పార్కింగ్‌కు కూడా అనుకూలంగా ఉండటంతో అక్కడే సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సభ ఏర్పాట్లు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, అదనపు ఎస్పీ ఏ.రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో అనిల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ పాల్గొన్నారు.