Share News

శాంతిభద్రతల పరిరక్షణకు తనిఖీలు

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:22 PM

నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణకు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు తనిఖీలు
కాలనీవాసులతో మాట్లాడుతున్న ఎస్పీ రావుల గిరిధర్‌

వనపర్తి రూరల్‌, నవంబరు23 (ఆంధ్రజ్యోతి) : నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణకు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు. ఎస్పీ రావుల గిరిధర్‌ ఆదేశాల మేరకు వనపర్తి డీఎస్పీ వెంక టేశ్వరరావు, వనపర్తి సీఐ క్రిష్ట ఆధ్వర్యంలో ఇద ్దరు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు మొత్తం 80 మ ంది పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వన పర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జంగాల గుట్ట, బుడగ జంగాల కాలనీలో పోలీసులు ఆక స్మికంగా కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ తనిఖీలు నిర్వహి ంచారు. ఈ సందర్భంగా సుమారు 250 ఇళ్లను సోదాలు చేశారు. పత్రాలు సరిగా లేని మరియు నెంబర్‌ ప్లేట్‌ లేని 2 కార్లు, 3 ఆటోలు, 25 ద్వి చక్ర వాహనాలు, మొత్తం 30 వాహనాలు అదు పులోకి తీసుకుని సీజ్‌ చేసి వనపర్తి రూరల్‌ పో లీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. సంబంధిత వాహ నాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్‌ మాట్లాడారు. నేరాల నిర్మూలనకు కమ్యూనిటీ కాంటాక్టు ప్రో గ్రాం నిర్వహిస్తామన్నారు. ప్రజల రక్షణ, భద్రత భావంపై, ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు వ చ్చి షెల్టర్‌ తీసుకుంటున్నారా అనే విషయం కూ డా తెలుస్తుందన్నారు. గుట్కాలు, గుడుంబా త యారీ, గంజాయి విక్రయించడం, పీడీఎస్‌ బి య్యం, కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరే కమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాందాస్‌ తేజా వత్‌, వెంకటేశ్వర్‌ రావు, పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:24 PM