Share News

ఎజెండాలో సమస్యలను సూచించాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:02 AM

జిల్లా స్థాయి సమన్వయ సమావేశం అంటే ఏమిటన్న ది తెలుసా అని కలెక్టర్‌ వియేందిర బోయి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎజెండాలో సమస్యలను సూచించాలి

జిల్లా సమన్వయ సమావేశంలో అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), అక్టోబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమం అనంత రం నిర్వహించుకుంటున్న జిల్లా స్థాయి సమన్వ య సమావేశంలో శాఖల వారిగా తెలిపిన కార్య సూచికలో (ఎజెండాలో) సమస్యలపైన లేదా కొత్త పోగ్రామ్స్‌పై గాని, కొత్తగా పథకాలు తదిత ర వాటి ప్రచారం వంటి కార్యక్రమల నిర్వహ ణకు సంబంధిత ఇతర శాఖల కోఆర్డినేషన్‌ అవ సరాన్ని, శాఖలకు సంబంధించి సమస్యలు ఎజెం డాలో సూచించాలి. కానీ అవేవీ పట్టనట్లు ప్రోగ్రె స్‌ను మాత్రమే సూచిస్తున్నారు. అసలు జిల్లా స్థాయి సమన్వయ సమావేశం అంటే ఏమిటన్న ది తెలుసా అని కలెక్టర్‌ వియేందిర బోయి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారు లతో జిల్లాస్థాయి సమన్వయ సమావేశం ప్రోగ్రె స్‌కు సంబంధించినది కాదని, సమస్యల పరిష్కా రం, కొత్త కార్యక్రమాల నిర్వహణ కోసం అధికా రుల సమన్వయం తదితర వంటి అంశాల పై చర్చించి పరిష్కరించుకునేందుకు నిర్వహి స్తున్నామని చెప్పారు. వచ్చే సోమవారానికి కో-ఆర్డినేషన్‌ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి తదితర శాఖలు, ఇతర శాఖలు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి శాఖలవారిగా నోట్స్‌ ఇవ్వాలని కలెక్ట ర్‌ ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, రెవెన్యూ అదన పు కలెక్టర్‌ మోహన్‌రావు, డీఆర్వో రవికుమార్‌, జడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, ఆర్డీఓ నవీన్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:02 AM