Share News

ఎంపీ డీకే అరుణను అడ్డుకోవడం సరికాదు

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:34 PM

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తుండ గా ఆమెను మన్నెగూడలో పోలీసులు అడ్డుకోవ డం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.పాండు రంగారెడ్డి అన్నారు.

ఎంపీ డీకే అరుణను అడ్డుకోవడం సరికాదు

- భగ్గుమన్న బీజేపీ శ్రేణులు

మహబూబ్‌నగర్‌ క్లాక్‌టవర్‌/ మిడ్జిల్‌, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): కొడంగల్‌ నియోజక వర్గం లగచర్లలో జరిగిన ఘటనను తెలుసుకొ నేందుకు మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తుండ గా ఆమెను మన్నెగూడలో పోలీసులు అడ్డుకోవ డం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.పాండు రంగారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పార్టీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ను కలిసేం దుకు ముందుగానే అనుమతి తీసుకొని, ఎంపీ హైదరాబాద్‌ నుంచి బయలుదేరారని, మార్గమ ధ్యలో పోలీసులు ఆపడం ఎంతవరకు సమంజ సమని ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్‌ కూ డా కాని ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డికి వర్తించని 144 సెక్షన్‌, డీకే అరుణమ్మకు ఎలా వర్తిస్తుందన్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, ప్రధానకార్యదర్శి కొత్తకోట కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు కిష్ట్య నాయక్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల ఆదయ్య, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:35 PM