ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:34 PM
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేస్తూ, మరింత నిఘా పెంచాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
గట్టు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జోగుళాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు
గట్టు (గద్వాల క్రైం) డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేస్తూ, మరింత నిఘా పెంచాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం గట్టు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో అధికా రులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు. నేరాల కట్టడి కోసం అధికారులు మరింత శ్రమించడం తో పాటు నేరం జరిగిన వెంటనే స్టేషన్ అఽధికారులు వేగంగా స్పందించాలని, చట్టాలను అతిక్రమించి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి విషయం ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ముందుస్తూ సమాచార సేకరణ అవసరమని, బ్లూ కోట్స్ సిబ్బంది డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందించి వారు సంఘటన స్ధలంకు త్వరగా చేరుకోవాలని సూచించా రు. గ్రామాలలో బ్లూ కోట్స్, పెట్రోకార్ సిబ్బంది విసబుల్ పోలీసింగ్‌ను మరింత పెంచాలన్నారు. గ్రామాల్లో రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లను తరచూ తనిఖీలు చేస్తూ ఉండాలని, గ్రామంలో ఎవరైనా కొత్తవారు వస్తే నిఘా ఉంచాలన్నారు. సరిహద్దు గ్రామాల్లో పీడీఎస్, ఇసుక, అక్రమ రవాణాపై నిఘా ఉంచి పట్టుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్‌ఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.