కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా చూడాలి
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:24 PM
మండల కేంద్రంతో పాటు సంకలమద్ది, నిజాలా పూర్‌లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్‌రావు తనిఖీ చేశారు.
- సంకలమద్ది, నిజాలాపూర్‌లో కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
మూసాపేట, నవంబరు 13 (ఆంరఽధజ్యోతి): మండల కేంద్రంతో పాటు సంకలమద్ది, నిజాలా పూర్‌లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్‌రావు తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసు కున్నారు. సంబంధిత ఐకేపీ అధికారులకు తగు సూచనలు చేశారు. ఇక్కడ కేంద్రాలను పనితీరు బాగా ఉండటంతో కేంద్రాల్లో కొనుగోలు ఊపందు కుందని తెలిపారు. రైతులు ఏమాత్రం దళారుల ను ఆశ్రయించకుండా వందశాతం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే వారికి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా వస్తోందని సూచిం చారు. ఇంక కూడా ఎక్కడైన గ్రామాల్లో ధాన్యం ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకోని వచ్చేలా ఐకేపీ సిబ్బంది తగు చర్యలను తీసుకో వాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ ఆర్.రాజు, ఏవో అనిల్‌కుమార్, గిర్దావర్ రవికు మార్ లింగం, ఏఈవో సుస్మితా, రైతులు గంగుల మాసిరెడ్డి, నారాయణ, సత్యశీలారెడ్డి, శ్రీనివాసులు, ఆంజనే యులు, రాములు తదితరులు ఉన్నారు.
తప్పులకు తావులేకుండా చూడాలి
సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహణ పక్రియలో ఏమాత్రం తప్పులు, తప్పిదాలకు తావులేకుండా ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆ ర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల పూర్తి వివరా లతో సమగ్రంగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ మోహన్‌రావు సూచించారు. బుధవారం మండలకేంద్రంతో పాటు నిజాలాపూర్‌లో సమగ్ర ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు. సర్వే నమోదు వివరాలను ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులు గోప్యత పాటించాలని, ఏ ఒక్క ఇంటినీ వదలకూడదని కార్యక్రమంలో తహసీ ల్దార్ ఆర్.రాజు, నయాబ్ తహసీల్దార్ వినోద్ కుమార్, ఏవో అనిల్‌కుమార్, గిర్దావర్ రవికుమా ర్ లింగం, పంచాయతీ కార్యదర్శి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.