Share News

కురుమూర్తిలో జనజాతర

ABN , Publish Date - Nov 10 , 2024 | 10:52 PM

మహ బూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురు మూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భం గా ఆదివారం జాతర మైదానంతో పాటుగా స్వామి మె ట్లదారి భక్తులతో కిక్కిరిసిపోయింది.

 కురుమూర్తిలో జనజాతర
స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు

- భారీగా తరలివచ్చిన భక్తులు

- దాసంగాలతో స్వామి వారికి మొక్కులు

చిన్నచింతకుంట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మహ బూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురు మూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భం గా ఆదివారం జాతర మైదానంతో పాటుగా స్వామి మె ట్లదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా భక్తుల రద్దీతో జాతర మైదానం అంతా సందడిగా మారింది. సీ ఎం రాక సందర్భంగా భక్తులకు వారి దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీం తో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మైదానంలో నూ జనజాతర కన్పించింది. వివిధ రకాల గాజులు, లేడీస్‌కార్నర్‌లు, రంగుల రాట్నాలు, ఇంకా అనేక రకాల దుకాణాలు కొనుగోలుదారుల తో సందడి నెలకొంది. కాగా పవిత్ర కోనేరులో భక్తులు స్నానాలు చేసి, స్వామి వారికి ప్రత్యేకమైన పచ్చిపులుసు, మట్టికుండల్లో అన్నం వండి దాసంగాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో వివిధ రకాల సర్కస్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - Nov 10 , 2024 | 10:52 PM