యేసు బోధనలు ఆదర్శం
ABN , Publish Date - Dec 15 , 2024 | 11:23 PM
యేసు ప్రభు తన బోధనల ద్వారా ప్రపంచంలో శాంతిని నెలకొల్పాడని ఎమ్మెల్యే యేసు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మమబూబ్‌నగర్ న్యూటౌన్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : యేసు ప్రభు తన బోధనల ద్వారా ప్రపంచంలో శాంతిని నెలకొల్పాడని ఎమ్మెల్యే యేసు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎంబీసీ చర్చిలో చర్చి సంఘం అధ్యక్షుడు వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంబీసీ ప్రతినిధులు అడిగిన వెంటనే ఐమాక్స్ లైట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు చర్చి ఆవరణలో ఐమాక్స్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి సిజే బెనహర్, ఎంబీసీ సంఘం వైస్ చైర్మన్ జాకోబ్, ఇమ్యానుల్ రాజ్, స్టీఫెన్, టైటస్, రాజేందర్, విక్టర్ పాల్గొన్నారు.
ప్రజలందరు సంతోషంగా ఉండాలి
పట్టణ ప్రజలు దత్తాత్రేయుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో గడపాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని తూర్పు కమాన్ వద్ద గల దత్తాత్రేయ స్వామి ఆలయం, వీరన్నపేటలోని నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం వద్ద గల దత్తాత్రేయ ఆలయంఓ దత్త పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన దత్త జయంతి వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బురుజు సుధాకర్‌రెడ్డి, గౌలి సుధాకర్, గుండా మనోహర్, చంద్రకాంత్, మనోహర్, కష్ణయ్య, రఘు, బండి మల్లేష్, నరేష్, గుండా మనోహర్ పాల్గొన్నారు.