కబడ్డీ కబడ్డీ
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:02 PM
మహబూబ్‌నగర్ జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ‘సీఎం కప్’ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలను డీవైఎ్‌సవో శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించిన డీవైఎ్‌సవో శ్రీనివాస్
33 జిల్లాల నుంచి 850 మంది క్రీడాకారులు హాజరు
మహిళల్లో మహబూబ్‌నగర్, పురుషుల్లో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జట్లు శుభారంభం
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, డిసెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ‘సీఎం కప్’ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలను డీవైఎ్‌సవో శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. టోర్నీకి 33 జిల్లాల నుంచి 850 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, వ్యాయమ ఉపాధ్యాయులు జగన్‌మోహన్‌గౌడ్, విలియం, వేణుగోపాల్, బాల్‌రాజ్, నిరంజన్ యాదవ్, రిటైర్డ్ పీడీ చెన్నవీరయ్య, శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, నగేష్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మహిళా జట్టు శుభారంభం
కబడ్డీ పోటీల్లో మహిళా విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు శుభారంభం చేసింది. మహబూబ్‌నగర్ జట్టు ఆదిలబాద్‌పై 57-09 తేడాతో గెలిచింది. నల్గొండ నిజామాబాద్‌పై 70-18, రంగారెడ్డి సిద్దపేటపై 50-7, హైదరాబాద్ నారయణపేటపై 49-18, మహబూబాబాద్ ఖమ్మంపై 30-26, సంగారెడ్డి పెద్దపల్లిపై 50-10, నాగర్‌కర్నూల్ మెదక్‌పై 41-10, మెడ్చల్ జట్టు కామారెడ్డిపై 41-04 స్కోర్ తేడాతో గెలుపొందాయి.
పురుషుల విభాగంలో..
పురుషుల విభాగంలో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జట్లు శుభారంభం చేశాయి. నాగర్‌కర్నూల్ జట్టు జగిత్వాలపై 28-17, వనపర్తి జట్టు మహబూబ్‌నగర్‌పై 38-10, గద్వాల జట్టు నిర్మల్‌పై 44-15 స్కోర్ తేడాతో గెలుపొందాయి. రంగారెడ్డి జట్టు మెడ్చల్‌పై 45-32, కొత్తగూడెం సూర్యపేటపై 23-16, నల్గొండ సిరిసిల్లపై 35-15, హైదరాబాద్ కామారెడ్డిపై 41-15, కరీంనగర్ వరంగల్‌పై 27-11, ములుగు మెదక్‌పై 48-26, నిజామాబాద్ భూపాలపల్లిపై 24-15 స్కోర్ తేడాతో గెలిచాయి.