Share News

కల్యాణం.. కమనీయం

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:12 PM

జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.

కల్యాణం.. కమనీయం
మరికల్‌లో స్వామి వారికి కల్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న చిట్టెం పర్ణికారెడ్డి దంపతులు

- వైభవంగా సీతారాముల కల్యాణం

- పట్టు వస్త్రాలు సమర్పించిన నారాయణపేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి

- మార్మోగిన శ్రీరామ నామస్మరణ

నారాయణపేట, ఏప్రిల్‌ 17 : జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలో 64 చోట్ల సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగగా, ఆలయాల్లో శ్రీరామ నామం మార్మోగింది. నారాయణపేట మూల హనుమాన్‌ మందిరంలో అర్చకుడు శ్రీపతి ప్రత్యేక పూజలు నిర్వహించగా జోషి రఘుప్రేమ చారి, విద్వాన్‌ హరీశ్‌ ఆచార్య సీతారాముల కల్యాణం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం అనంతరం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో మూల హనుమాన్‌ భక్త బృందం శంకర్‌, రాజు, హన్మంతు, నాగేందర్‌, వెంకట్‌ రాజ్‌, రాజు లహోటి, సురేష్‌, గందె రవికాంత్‌, గోపాల్‌ రెడ్డి, వెంకటేష్‌, అనిల్‌, రవిగౌడ్‌, రఘువీర్‌ యాదవ్‌, సంతోష్‌ కుమార్‌, క్యాతన్‌ రఘునాథ్‌, రాము పాల్గొన్నారు. బ్రహ్మణ్‌ వాడీ రామాలయంలో అదనపు కలెక్టక్‌ మయాంక్‌ మిట్టల్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో డోలారోహణం జరిగింది. సంత్‌మఠ్‌ రామాలయంలో యజ్ఞ నారాయణ పురోహిత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కొనసాగగా, అనంతసేన ఆలయంలో అర్చకులు శ్రీపాద్‌ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శక్తిపీఠంలో స్వామి శాంతానంద్‌ నేతృత్వంలో సీతారాముల కల్యాణ వేడుకలను శోభాయమానంగా జరిపించారు.

భారీ బైక్‌ ర్యాలీ

శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో పళ్ల హనుమాన్‌ మందిరం దగ్గర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించగా కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శివకుమార్‌ రెడ్డి, బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండు రెడ్డి, రఘురామయ్య గౌడ్‌, బిల్డర్‌ వెంకట్రాములు, కౌన్సిలర్‌ మహేష్‌, కాంగ్రెస్‌ నాయకులు లిఖీ రఘు, వెంకటేష్‌ గౌడ్‌, రవి, పవన్‌, ఆనంద్‌, వీహెచ్‌పీ నాయకులు ప్రవీణ్‌, నర్సిములు, క్యాతన్‌ రఘు, శ్రావణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:12 PM