ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:43 PM
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాణి లక్ష్మీబాయి ఆ త్మరక్షణ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నెలల పాటు ఉచి తంగా కరాటే శిక్షణ ఇస్తున్నారు.
మక్తల్‌రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాణి లక్ష్మీబాయి ఆ త్మరక్షణ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నెలల పాటు ఉచి తంగా కరాటే శిక్షణ ఇస్తున్నారు. అందులో భా గంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో కరాటే మాస్టర్ సయ్యద్ ఇస్మాయిల్ ఆధ్వర్య ంలో విద్యార్థులకు శిక్షణ బుధవారం ప్రారంభిం చారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం గోపాలచారి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 124 పా ఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం కరాటే కోచ్‌లకు గౌరవభృతిని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు ఏదైనా ఆపత్కర సమయంలో తమను తాము రక్షించుకునే విధంగా శిక్షణ దోహదపడుతుందన్నారు. మూడు నెలల పాటు వారానికి మూడుసార్లు శిక్షణ ఉంటుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. అనంతరం కరాటే మాస్టర్ విద్యార్థినులకు కరాటే శిక్షణలో భాగంగా మెళుకువలను నేర్పించారు.