Share News

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

ABN , Publish Date - Dec 25 , 2024 | 11:25 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గంతో పీసీసీ ఆధ్యక్షుడిగా ఉన్న సమయంలో సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు

- ముగ్గులు వేసి నిరసన తెలిపిన సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గంతో పీసీసీ ఆధ్యక్షుడిగా ఉన్న సమయంలో సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల చేపట్టిన నిరసన సమ్మె బుధవారంతో 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా మహిళ ఉద్యోగులు ధర్నా చౌక్‌లో ముగ్గులు వేస్తూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ సమస్యను పరిష్కరించాలని రేవంత్‌రెడ్డి చిత్రంతో పాటు సమస్యలను ముగ్గులలో వేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తాము నిరసన చేస్తుంటే సమస్యలపై దృష్టి పెట్టకుండా కేజీబీవీలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో బోధన చేయించేందుకు నిర్ణయం తీసకుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇప్పటికైన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు యాదగిరి, ఖాజామైనోద్దీన్‌, ఎండీ ఇక్రం, తిరుపతయ్య గౌడ్‌, ఉదయ్‌, శంకరమ్మ, సుజాత, నాగలక్ష్మి, గంగమ్మ పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 11:25 PM