Share News

అధికారుల అలసత్వం

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:34 PM

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తూ వచ్చిన నిరుద్యోగులకు ప్రభుత్వం రెగ్యులర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీచేసింది.

  అధికారుల అలసత్వం

- అనుభవ ధ్రువపత్రం ఇచ్చేందుకు నిరుద్యోగులతో ఆటలు

- స్థానిక పరీక్ష సెంటర్‌ను కోల్పోయిన అభ్యర్థులు

- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బంది నిర్వాకం

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) సెప్టెంబరు 28: కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తూ వచ్చిన నిరుద్యోగులకు ప్రభుత్వం రెగ్యులర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇన్నాళ్లు పనిచేసిన కాలానికి అనుభవ ధ్రువపత్రం తోడైతే కొన్ని మార్కులు కలిసి వచ్చి ప్రభుత్వ కొలువు వస్తుందనే ఆశతో వారు దరఖాస్తు చేసుకు న్నారు. కానీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం అధికారులు మాత్రం నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారనే ఆరోపణులు వస్తు న్నాయి. అనుభవ ధ్రువపత్రం ఇచ్చేందుకు కార్యాలయం చుట్టూ తిప్పుకుం టున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్థానికంగా పరీక్ష రాసే సెంటర్‌ ను కోల్పోయామని, ఇక హైదరాబాద్‌కు వెళ్లి పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడిందని నిరుద్యోగులు వాపోతున్నారు. జిల్లాలోని అన్ని విభాగాల పరిధిలోని అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందికి అనుభవ ధ్రువపత్రాలు ఇచ్చినా డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం అధికారులు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు.

1,275 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు రెగ్యులర్‌ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 1,275 ల్యాబ్‌టెక్నీషియన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వేసింది. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు స్వీకరించి అక్టోబరు 5 చివరి తేదీగా నిర్ణయించింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ వైద్యకళాశాల, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఖచ్చితంగా అనుభవ ధ్రువపత్రం ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరు నెలలకు 2 మార్కుల చొప్పున ఐదేళ్లు పనిచేసి న వారికి 20 మార్కులు కలుపుతారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్‌డ్‌ పరీక్ష రాయాలి. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఈ కేంద్రాలు నిండి పోతే హైదరాబాద్‌కు వెళ్లి పరీక్ష రాయాలి. జిల్లాలోని ప్రభుత్వ వైద్యకళాశాల, జనరల్‌ ఆసుపత్రి పరిధిలో మొత్తం 50 మంది వరకు ల్యాబ్‌టెక్నీషి యన్లు అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వారందరికి ఆయా శాఖల అధికారు లు అనుభవ ధ్రువపత్రాలు అందజేశారు. కానీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం అధికారులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో పరిధిలో మొత్తం 30 మంది వరకు ల్యాబ్‌టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అందులో 104 అంబులెన్సులో 16 మంది, అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, టీబీ సెంటర్లు-10, డీఎంఅండ్‌హెచ్‌వో పరిధి లో నలుగురు ఉన్నారు. వీరంతా రెగ్యులర్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుభవ ధ్రువపత్రం కోసం డీఎం అండ్‌హెచ్‌వో కార్యాల యం చుట్టూ తిరుగుతున్నారు. కానీ, అధికారులు మాత్రం ఎప్పుడు పని చేశారు... ఎక్కడ పనిచేశారు.. అని కుంటిసాకులు చెబుతూ తిప్పుకున్నా రనే ఆరోపణలు వస్తున్నాయి.. అయినప్పటికీ అన్ని ధ్రువపత్రాలు సమర్పించారు. కానీ, వారు మాత్రం నిర్లక్ష్య ధోరణిని వీడలేదు. గత్యంతరం లేక స్థానిక ఎమ్మెల్యేను కూడా కలిశారు. ఆయన కూడా నేను చెప్తాను వెళ్లండని సర్దిచెప్పి పంపించారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి జిల్లాకేంద్రంలో ఉండే సెంటర్లు వచ్చాయి. డీఎంఅండ్‌హెచ్‌వో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనుభవ ధ్రువపత్రం ఆలస్యం చేయడంతో హైదరాబాద్‌లో పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా ఫార్మాసిస్టు, నర్సింగ్‌ రెగ్యులర్‌ పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ వేశారు. వాళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్య ధోరణికి అడ్డుకట్ట వేసి నిరుద్యోగులకు సకాలంలో అనుభవ ధ్రువపత్రాలు ఇవ్వాలని కోరుతు న్నారు.

Updated Date - Sep 28 , 2024 | 11:34 PM