శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదాం
ABN , Publish Date - Nov 20 , 2024 | 10:49 PM
శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేద్దామని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సూర్యం కార్మికవర్గానికి పిలుపునిచ్చారు.
- టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం
మక్తల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేద్దామని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సూర్యం కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. రష్యా విప్లవయో ధుడు లెనిన్ శతజయంతి సందర్భంగా టీయూసీఐ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని మా ర్కెట్‌యార్డులో యూనియన్ జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. సదస్సుకు సూర్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1917 నవంబరు ఏడున కార్మికవర్గం అధికారంలోకి వచ్చిందన్నారు. లెనిన్ స్ఫూర్తిగా కార్మికవర్గం పోరాట మార్గం ఎంచుకొని అధికారం చేజిక్కించుకోవాలన్నారు. టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కిరణ్, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి రాము, డివిజన్ కార్యదర్శి రాము, నర్సింహ, రాము, బుట్టో, నర్సి ములు, ఈశ్వరయ్య, రాములు, రమేష్ ఉన్నారు.