అంబేడ్కర్ ఆశయ సాధనకు పాటుపడుదాం
ABN , Publish Date - Dec 06 , 2024 | 11:27 PM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ ఆశయ సాధనకు పాటుపడుదామని మ క్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
- మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
- వాడవాడలా అంబేడ్కర్ వర్ధంతి
- పూలమాలలతో ఘన నివాళులు
మక్తల్/కోస్గి/నారాయణపేట/నర్వ/ మరికల్/ఊట్కూర్/ మద్దూర్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ ఆశయ సాధనకు పాటుపడుదామని మ క్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేడ్కర్ యువజన సంఘం, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయ కులు వేర్వేరుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ అంబేడ్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారన్నారు. రాజ్యాంగ ఫలాలు ప్రతీ ఒక్క రికి అందేలా పనిచేశారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, రవికుమార్, కట్టసురేష్‌కుమార్‌గుప్తా, గణేష్ కుమార్, గోలపల్లి నారాయణ, అనిల్, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు సిరాజ్, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
అదేవిధంగా, కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్‌ను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్లవిజయ్‌కుమార్, నాయకులు హరి, అన్నకిష్టప్ప, బ్యాగరి రాములు, రామకృష్ణ తదితరులున్నారు.
నారాయణపేటలో అంబేడ్కర్ సంఘం నాయ కులు సత్యనారాయణ, ఆశప్ప, కృష్ణ, శరణప్ప, బుల్లెట్ రాజు, లక్ష్మణ్, సూర్యకాంత్, వెంకటేష్, ప్రజా సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
నర్వలో అంబేడ్కర్ విగ్రహానికి పలు పార్టీల నాయకులు, దళిత సంఘాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ సర్పంచ్ పెద్దింటి సం ధ్య, మాజీ వైస్ ఎంపీపీ దండు వీణావతి, శం కర్, విండో వైస్ ఎంపీపీ లక్ష్మన్న, కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
మరికల్ మండల కేంద్రంతో పాటు, తీలేరు గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువు రు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలుతోనే సా మాజిక సమన్యాయం జరుగుతుందని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.చక్రవర్తి, జిల్లా కన్వీనర్ లక్ష్మయ్యలు పేర్కొన్నారు. దళిత నాయకులు, అఖిల పక్షం నాయకులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌లోని బస్టాండ్ సెంటర్‌లో అంబే డ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూ లమాల వేసి నివాళ్లు అర్పించారు. జడ్పీటీసీ మాజీ సభ్యులు సూర్యప్రకాష్‌రెడ్డి, అరవింద్‌కు మార్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షు డు శంకర్, నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో కూడా అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు.
మద్దూర్‌లో శుక్రవారం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివా ళులు అర్పించారు. వివిధ పార్టీల నాయకులు పాత బస్టాండ్ చౌరస్తాలో గల అంబేడ్కర్ విగ్రహా నికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు బస్వరాజ్‌యాదవ్, ఫేరో మండల అధ్యక్షుడు పోన్నయ్య తదితరులు పాల్గొన్నారు.