రైతు సదస్సును విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:25 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే రైతు సదస్సు బహిరంగ సభను విజయవంతం చేద్దామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే రైతు సదస్సు బహిరంగ సభను విజయవంతం చేద్దామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అమిస్తాపూర్ వద్ద నిర్వహిస్తున్న రైతు సదస్సు బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.