వ్యాపారంలో నష్టం.. యువకుడి బలవన్మరణం
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:11 PM
జాతీయ రహదారి-44 బోరవెల్లి స్టేజి సమీపంలో యువకుడు వేప చెట్టుకి ఉరేసుకుని బల వన్మరణానికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మాన వపాడు మండలంలో చోటు చేసుకుంది.
మానవపాడు, డిసెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి-44 బోరవెల్లి స్టేజి సమీపంలో యువకుడు వేప చెట్టుకి ఉరేసుకుని బల వన్మరణానికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మాన వపాడు మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రకాంత్ తెలి పిన వివరాల మేరకు రాజోలి మండలం నసనూరుకు చెందిన కుమార్ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాబు (23) ఏడాది క్రితం అయిజ మండల కేంద్రంలో రెడిమేడ్ దుస్తుల వ్యాపారం మొదలుపెట్టాడు. ఇందులో నష్టం రావడం.. అప్పులు ఎక్కవై ప్రతి రోజు ఇబ్బంది పడుతుండేవాడు. బుధవారం రాత్రి బోరవెల్లి స్టేజి వద్దకు చేరుకుని స్నేహితుడు మహేష్‌కి ఫోన్ చేసి తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. స్థాని క పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చే రుకునే సరికి బాబు మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. తండ్రి ఫి ర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.