Share News

గుజరాత్‌ రైతుల పైనే ప్రేమ

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:18 PM

గుజరాత్‌ రాష్ట్ర రైతులపై ఉన్న ప్రేమ, తెలం గాణ, ఇతర రాష్ట్రాల రైతులపై ఎందుకు లేదో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పా లని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు డిమాండ్‌ చేశా రు.

గుజరాత్‌ రైతుల పైనే ప్రేమ
సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

- తెలంగాణ రైతులపై ఎందుకు లేదు

- కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి

- అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు

- ఊట్కూరులో కాటన్‌ మిల్లు పరిశీలన

ఊట్కూర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : గుజరాత్‌ రాష్ట్ర రైతులపై ఉన్న ప్రేమ, తెలం గాణ, ఇతర రాష్ట్రాల రైతులపై ఎందుకు లేదో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పా లని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు డిమాండ్‌ చేశా రు. ప్రజాసంఘాల ప్రతినిధి బృందం సభ్యు లు బుధవారం నారాయణపేట జిల్లా ఊ ట్కూర్‌ మండల కేంద్రంలోని విజయ కాటన్‌ ఇండస్ట్రీస్‌, మక్తల్‌లోని వినాయక్‌ కాటన్‌ మిల్లులను పరిశీలించారు. రైతులతో మా ట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారితో కలిసి మిల్లు మెందు ఆందోళన చేపట్టారు. అనంతరం భగవంతు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌ రాష్ట్రంలో పత్తికి రూ. 8,500 ఇస్తోందని, సీసీఐ ఆధ్వర్యంలో తెలం గాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో రూ. 7,521 మాత్రమే ఇస్తోందని తెలిపారు. అక్కడి రైతులపై ఉన్న ప్రేమ ఇక్కడి రైతులపై ఎం దుకు లేదని ప్రశ్నించారు. రైతులు ఎకరానికి రూ. 40వేల నుంచి రూ. 60 వేల వరకు పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేస్తే, వర్షాఆలకు పంట దెబ్బతిని 50 శాతం మాత్రమే దిగుబడి వచ్చిందని చెప్పారు. 33 శాతం నష్టం వాటిల్లినా పరి హారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 50 శాతం నష్టం జరిగినా స్పందించడం లేదని ఆరోపించారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేయబోమంటూ సీసీఐ అధికారులు రైతులను ఇబ్బంది పెడ్తున్నారన్నారు. స్వామి నాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పత్తి క్వింటాల్‌కు రూ. 18,500 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. సమగ్ర ఖర్చుల ప్రతి పాదికన కనీస మద్దతు ధరను నిర్ణయించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌లో దళారుల దోపిడీని అరికట్టాలన్నారు. అంతకు ముందు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి కనకరాయుడు మాట్లాడారు. కార్య క్రమంలో నాయకులు కృష్ణయ్య, బాబు, లింగప్ప, రాజు, కిరణ్‌, రైతులు గుర్రాల నర్సింహులు, బోర్ర బాలప్ప, హోటల్‌ శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:18 PM