Share News

మైసమ్మ ఆలయ అభివృద్ధికి సహకరించాలి

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:10 PM

ఫతేపూ ర్‌ మైసమ్మ ఆలయ అభివృద్ధికి చేయూత అం దించాలంటూ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి కోరారు.

మైసమ్మ ఆలయ అభివృద్ధికి సహకరించాలి
అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి

- అటవీ భూమి సమస్యను పరిష్కరించండి

- అసెంబ్లీలో జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఫతేపూ ర్‌ మైసమ్మ ఆలయ అభివృద్ధికి చేయూత అం దించాలంటూ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో అటవీశాఖ, గిరిజనుల మధ్య భూ వివాదాలకు సంబంధించిన అంశంపై జరిగిన చర్చలో నవా బ్‌పేట్‌ మండలంలోని ఫతేపూర్‌ మైసమ్మ ఆల య అభివృద్ధి అంశంపై మాట్లాడారు. అప్ప న్నపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఫతేపూర్‌ మైస మ్మ ఆలయం ఉండడంతో అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం లేకుండా ఉందన్నారు. అటవీభూమికి బదులుగా మరో ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని అటవీ శాఖకు ఇచ్చేం దుకు కలెక్టర్‌ సిద్ధంగా ఉన్నారంటూ సభ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే లేవనెత్తిన అంశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బదులు ఇచ్చారు. అటవీ భూ వివాదాలు అనేక ప్రాంతాలలో ఉన్నాయని, సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

హైడ్రా చట్టాన్ని అమలు చేయాల్సిందే..

హైడ్రా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయా ల్సిందేనని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. హై డ్రా అంశంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలో తన సొంత గ్రామ మైన రంగారెడ్డిగూడలో హైడ్రాను మొట్ట మొదటి సారిగా అమలు చేయడం జరిగిం దన్నారు. ఇరిగేషన్‌శాఖ అధికారులతో చెరువును సర్వే చేయించడంతో ఎఫ్‌టీఎల్‌లో ఉన్న సొంత భూమి రెండు ఎకరాలను వదులుకున్నట్లు తెలి పారు. భవిష్యత్‌ తరాలకోసమైన చెరువులను కాపాడాలని, చెరువులను ఆక్రమిస్తున్న వారిలో ఎంతటివారినైనా ఉపేక్షించకూడదన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:10 PM