Share News

మన్మోహన్‌ సింగ్‌ సేవలు మరువలేనివి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:15 PM

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సేవలు మరువలేనివని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

మన్మోహన్‌ సింగ్‌ సేవలు మరువలేనివి
మక్తల్‌లో మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి నివాళ్లు అర్పిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్‌ నాయకులు

- మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలతో కాంగ్రెస్‌ నాయకుల ఘన నివాళి

మక్తల్‌/నారాయణపేట/మక్తల్‌/దామరగిద్ద/కృష్ణ/మరికల్‌/ఊట్కూర్‌/కోస్గి/మద్దూర్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సేవలు మరువలేనివని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక విధానాలతో దేశంలో పేదరికం తగ్గించిన గొప్ప నేత మన్మోహన్‌సింగ్‌ అని కొనియాడారు. ఆయన హయాంలోనే ప్రత్యేక తెలంగాణ కల సాకారం అయ్యిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మారెడ్డి, కట్టసురేష్‌కుమార్‌గుప్తా, చంద్రకాంత్‌గౌడ్‌, బోయ రవికుమార్‌, కోళ్ల వెంక టేష్‌, భాస్కర్‌, గోలపల్లి నారాయణ, రవీందర్‌, తాయప్ప, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా, నారాయణపేట పట్టణంలో కాం గ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం ఆధ్యర్యంలో పార్టీ నాయకులు స్థానిక సీవీఆర్‌ భవన్‌తో పాటు నర్సిరెడ్డి చౌరస్తాలో మన్మోహన్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణభట్టడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డిలు మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చిన మేధావి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కోనంగేరి హన్మంతు, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్‌ నాగరాజ్‌, గందె చంద్రకాంత్‌, డాక్టర్‌ సాయిబాబ, కోట్ల రవీందర్‌రెడ్డి, బోయ శరణప్ప, రమేష్‌, యూసుఫ్‌, మారుతి, సునీల్‌, వెంకటయ్య, రవికిరణ్‌, చిట్టెం సత్యారెడ్డి, శంకర్‌, వెంకటప్ప, కార్తీ క్‌, సిద్ధు, ఆనంద్‌ తదితరులున్నారు.

దామరగిద్దలోని అంబేడ్కర్‌ కూడలిలో మన్మో హన్‌సింగ్‌ చిత్రపటానికి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, విండో చైర్మన్‌ పుట్టి ఈదప్ప తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు. ఖాజామియా, శరణ్‌నాయక్‌, అశోక్‌, కనికిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, రఘు, ఆనంద్‌, వెంకటప్ప, రంజిత్‌, నర్సింహ తదితరులున్నారు.

కృష్ణలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి యువజన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సర్పరాజ్‌ తదితరులు నివాళులర్పించారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు సిద్రామప్ప, నాయకులు పాల్గొన్నారు.

మరికల్‌లోని ఇందిరాగాంధీ చౌరస్తాలో మన్మోహన్‌ చిత్రపటానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు వీరన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ఊట్కూర్‌లో మన్మోహన్‌సింగ్‌ చిత్రపటం వద్ద కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నివాళ్లు అర్పించారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యప్రకాష్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు యజ్ఞేశ్వర్‌రెడ్డి, విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

కోస్గి పట్టణంలోని శివాజీ కూడలిలో మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, మునిసిపల్‌ అధ్యక్షుడు బెజ్జురాములు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మద్దూర్‌లోని పాత బస్టాండ్‌ చౌరస్తాలో మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానిగా ఆయన అమలు పర్చిన సంస్కరణలను నాయకులు గుర్తు చేశారు. కోస్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:15 PM