Share News

మక్తల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Dec 26 , 2024 | 10:56 PM

మక్తల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అఖిలపక్ష పార్టీల నాయకులు కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు వినతిపత్రం అందించారు.

మక్తల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి
కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు వినతిపత్రం అందిస్తున్న అఖిలపక్ష పార్టీల నాయకులు

కలెక్టర్‌కు అఖిలపక్ష పార్టీల నాయకుల వినతి

మక్తల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మక్తల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అఖిలపక్ష పార్టీల నాయకులు కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌లు మాట్లాడుతూ మక్తల్‌ నియోజకవర్గ కేంద్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు ఉన్నాయన్నారు. పదేళ్ల నుంచి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రవికుమార్‌, సోమశేఖర్‌గౌడ్‌, సలీం, జయానంద్‌, సత్యనారాయణగౌడ్‌, కనకరాజు, కోళ్ల వెంకటేష్‌, బిజ్వార్‌ వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 10:56 PM