మౌలానా అబుల్‌కలాం ఆజాద్ సేవలు మరువలేనివి
ABN , Publish Date - Nov 11 , 2024 | 11:21 PM
జాతి గర్వించదగిన నాయకుడు మౌలానా అబు ల్కలాం ఆజాద్ అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి కొని యాడారు.
మహబూబ్‌నగర్, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): జాతి గర్వించదగిన నాయకుడు మౌలానా అబు ల్కలాం ఆజాద్ అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి కొని యాడారు. తొలి విద్యాశాఖ మంత్రిగా భారత విద్యావ్యవస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారన్నా రు. మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు. కార్యక్రమంలో వినోద్‌కుమార్, సత్తూర్చంద్రకుమార్గౌడ్, సిరాజ్ ఖాద్రి, అనిత, సీజె బెనహర్, ఎన్‌పి వెంకటేశ్, సాయిబాబ, ఫయాజ్, అజ్మత్‌అలీ పాల్గొన్నారు.
బాలికల కళాశాలకు బెంచీలు
జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశా లకు తన సొంత నిధులతో 200డబుల్ డెస్క్ బెంచీలు అందించన్నుట్లు ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం వంద బెంచీలు అందించామని, త్వర లోనే మరో వంద బెంచీలు అందిస్తామన్నారు.