Share News

సత్యసాయి బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలి

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:18 PM

భగవాన్‌ సత్యసాయి బాబా ఆశీ స్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు.

సత్యసాయి బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలి
సత్యసాయి బాబా చిత్రపటం వద్ద పూజలు చేస్తున్న ఎమ్మెల్యే, మునిసిపల్‌ చైర్మన్‌

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): భగవాన్‌ సత్యసాయి బాబా ఆశీ స్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. శనివారం సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు పట్టణంలోని సాయిబాబా మందిరంలో సత్య సాయి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడు కలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో మునిసి పల్‌ చైర్మన్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌, కౌన్సిలర్‌ తిరుమల వెంకటేష్‌, వెంకటేష్‌, జాజిమొగ్గ శ్రీని వాస్‌, శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం): పట్ట ణంలోని మెట్టుగడ్డ వద్ద గల బాలసదన్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శనివారం సంద ర్శించారు. సంరక్షణ కేంద్రంలో ఉన్న చిన్నారులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారని నిర్వాహ కులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదేవి ధంగా చిన్నారులకు రోజు అందిస్తున్న భోజనం, వారి సంరక్షణ గురించి ఆరా తీశారు. చిన్నా రులను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వారిని జన రల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాలన్నారు. ప్రతి రోజు వారికి నాణ్యమైన ఆహారాన్ని అంది ంచాలని ఆదేశించారు. వారి ఆలనా పాలనలో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. అనంతరం సీడీపీవో కార్యాలయాన్ని సందర్శించారు. ఆ యనతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహరెడ్డి, కౌన్సిలర్‌ తిరుమల వెంకటేష్‌, డీసీ సీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, సత్తూరు చంద్రకుమార్‌గౌడ్‌, రాఘవేందర్‌, సీడీపీవో రాధిక తదితరులు ఉన్నారు.

డైట్‌, బీఎడ్‌ కళాశాలను పరిశీలించిన

ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: గత ప్రభు త్వ విద్యా వ్యవస్థలను పూర్తిగా గాలికి వదిలే సిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డైట్‌, బీఎడ్‌ కళా శాలను పరిశీలించారు. విద్యార్థులను, అధ్యాప కులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 30న డైట్‌ కళాశాల భవనానికి శంకుస్థాపన చే యనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఏడ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గోవిందరాజులు, డైట్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ డా.మహ్మద్‌ మెరజుల్లాఖాన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నరసి ంహరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సమర్థవంతంగా పశుగణన

పాలమూరు: పశుగణను జిల్లాలో సమర్థ వం తంగా నిర్వహించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా సరెడ్డి అధికారులను ఆదేశించారు. శని వారం క్యాంపు కార్యాలయంలో పశుగణన వాల్‌ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. జిల్లాలోని పారా సిబ్బంది, గోపాలమిత్రలు, వంద మంది ఎన్యుమరేటర్లను గుర్తించామని జిల్లా పశుసంవర్థక అధికారి మధుసూదన్‌గౌడ్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు వివరాలు సేకరిస్తా మన్నారు. కార్యక్రమంలో జిల్లా నోడల్‌ అధికారి వెంకటేశ్వర్లు, పశువైద్యాధికారి రాంప్రసాద్‌, పశు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: తక్షణమే జీవో 317 బాధితులకు స్థానికత స్పౌజ్‌ ఆధారం గా న్యాయం చేయాలని, వారిని సొంత జిల్లాల కు పంపాలని పీఆర్టీయూ వ్యవస్థాకుడు గాల్‌ రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, టీపీఆర్టీ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు శ్యాంబాబు, రమాకాంత్‌ శనివారం ఎ మ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Nov 23 , 2024 | 11:18 PM