Share News

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:32 PM

వరి ధాన్యం అమ్మిన 48గంటల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి అన్నారు.

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

- పాతమొల్గరలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్‌

భూత్పూర్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం అమ్మిన 48గంటల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని మధ్ధిగట్ల గ్రామ శివారులో ఉన్న మద్ధికాన్‌ చెరువులో ప్రభుత్వం నుంచి మం జూరైన ఉచిత చేపపిల్లల పంపిణీ, మండలంలో ని పాతమొల్గరలో రైతుల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భం గా అక్కడికి వచ్చిన పాత్రికేయులతో ఎమ్మెల్యే జీఎంఆర్‌ మాట్లాడారు. గత ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నెలల తరబడి వారికి డబ్బులు చెల్లించకుండా నానాఇబ్బందుల పాలు చేసిందని, అలాకాకుండా కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభు త్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన 48గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగు తుందని ఈసందర్భంగా స్పష్టంచేశారు. అదేవిధం గా సన్నవరి ధాన్యానికి గతంలో ప్రకటించన ట్లుగా ప్రతి క్వింటాకు రూ.500 బోనస్‌ కూడా వెంటనే జమచేయడం జరుగుతుందని పేర్కొన్నా రు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే రైతు లకు భరోసానిచ్చారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం బోనస్‌తో పాటుగా మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో లూటీ చేసిందని క్వింటాలుకు 6-7కిలల తరుగు తీసి రైతులను దోచుకుందని ఎమ్మెల్యే జీఎంఆర్‌ విమర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగనీయకుండా నిజాయితీగా రైతుల ఖాతాల్లో డబ్బులు చేరేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే భూత్పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబా రక్‌, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు అశోక్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ హర్యానాయక్‌, నాయకులు వెంకటేష్‌, రాంరెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ లాలునాయక్‌, ఎంపీ డీవో ప్రభాకచారి, డిప్యూటీ తహసిల్దార్‌ గీతా, అధికారులు, వివిధగ్రామాల నుంచి వచ్చిన కాం గ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:32 PM