Share News

పెన్షన్‌ పెంపు కోసం నేటి నుంచి ఉద్యమం

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:15 PM

దివ్యాంగుల పెన్షన్‌ రూ.ఆరు వేలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమాలు చేపట్టనున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ అన్నారు.

పెన్షన్‌ పెంపు కోసం నేటి నుంచి ఉద్యమం
మాట్లాడుతున్న వెంకట్‌

- డిసెంబరు 9న చలో హైదరాబాద్‌

- దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌

నారాయణపేట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల పెన్షన్‌ రూ.ఆరు వేలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమాలు చేపట్టనున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ అన్నారు. మంగళవారం నారాయణపేట అంబేడ్కర్‌ భవనంలో జిల్లా కమిటీ అధ్యక్షురాలు రాధమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన వెంక ట్‌ మాట్లాడారు. అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.ఆరు వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.నాలుగు వేలు పెన్షన్‌ పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా పెన్షన్‌ పెంచకుండా కాలయాపన చేస్తోందన్నారు. కొత్త పెన్షన్ల కోసం 24.85 లక్షల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. ఉద్యోగ నియామకాల్లో శారీరక దివ్యాంగులకు రోస్టర్‌ పది లోపు తగ్గించాలన్నారు. రూ.25 వేలు ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ నెల 20 నుంచి 25 వరకు గ్రామాల్లో ప్రచారం చేస్తామని, 25న కలెక్టరేట్‌ ముట్టడి, 28, 29 తేదీల్లో ఎమ్మెల్యేలకు వినతులు ఇవ్వడం, 30న ఆర్డీవో కా ర్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడతామ న్నారు. డిసెంబర్‌ 9న చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తున్నామన్నారు. సమావేశంలో దశరథ్‌, బాబు, రంగయ్య, మల్లేష్‌, నర్సప్ప, బస్వరాజ్‌, పెంటయ్య, హన్మంతు, రాములు తదితరులున్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:15 PM