ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:29 PM
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
- డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి
నారాయణపేట/మక్తల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వ్యాధి సోకిన వారి పట్ల వివక్ష చూపొద్దన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది డా.శైలజ, సాయిరామ్, డా.రాఘవేంద్ర, భిక్షపతి, శ్రీనివాసులు, సుధాకర్‌బాబు తదితరులున్నారు. అదేవిధంగా, మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ రాజేష్ మాట్లాడారు. అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని అరికట్టవచ్చన్నారు. ప్రతీ ఒక్కరు ఎయిడ్స్ బారిన పడకుండా అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో జోగినీ వ్యతిరేక పోరాట సమితి నాయకురాలు హాజమ్మ, వైద్య సిబ్బంది నారాయణ, శంకర్‌లింగం తదితరులున్నారు.