Share News

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించేలా పనిచేయాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:00 PM

‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేలా ఉపాధ్యాయులందరు పని చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు.

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించేలా పనిచేయాలి
బిజ్వార్‌ పాఠశాలలో డైనింగ్‌ హాల్‌ను పరిశీలిస్తున్న డీఈవో గోవిందరాజులు

- పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయండి

- డీఈవో గోవిందరాజులు

ఊట్కూర్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేలా ఉపాధ్యాయులందరు పని చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు. శనివారం మండ లంలోని బిజ్వార్‌ గ్రామ ఉన్నత, ప్రాథమిక పాఠశాల లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం గా మధ్యాహ్న భోజనం గదిని, డైనింగ్‌ హాల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్ర తీ ఉపాధ్యాయుడు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు బోధన చేయాలని అన్నారు. వెంటనే సిలబస్‌ను పూర్తి చేసి విద్యార్థులకు ప్రత్యేక తరగతు లు నిర్వహించాలన్నారు. పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన జిల్లా ఇన్‌చార్జి యాదయ్యశెట్టి, హెచ్‌ఎంలు కిశోర్‌కుమార్‌, చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు మహేష్‌, రమేష్‌, గోపాల్‌, నాగరాజు, గజలప్ప, శేఖర్‌, నరేష్‌, కృష్ణ ఉన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:00 PM