Share News

పాలమూరును సస్యశ్యామలం చేశాం

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:19 PM

పెండింగ్‌ ప్రాజెక్టుల ను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి ఉమ్మడి పాలమూరు జిల్లాను బీఆర్‌ఎస్‌ హయాంలో సస్యశ్యామలం చేశామని, రూ. 4వేల కోట్లు ఖర్చు చేయడం ద్వారా 6.50లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

పాలమూరును సస్యశ్యామలం చేశాం

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు

- రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి.. 6.50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం

- పూర్తికావొచ్చిన పీఆర్‌ఎల్‌ఐని పడావు పెట్టిన ఘనత రేవంత్‌ది

- కురుమూర్తి వద్ద విలేకరులతో మాజీ మంత్రి హరీశ్‌రావు

మహబూబ్‌నగర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పెండింగ్‌ ప్రాజెక్టుల ను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి ఉమ్మడి పాలమూరు జిల్లాను బీఆర్‌ఎస్‌ హయాంలో సస్యశ్యామలం చేశామని, రూ. 4వేల కోట్లు ఖర్చు చేయడం ద్వారా 6.50లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మహబూ బ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలో బుధవారం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవా ల్లో పాల్గొన్న ఆయన.. పూజలు నిర్వహిం చారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము పెండింగ్‌ ప్రాజెక్టులను రాత్రిం బవ ళ్లు వాటి వద్ద నిద్ర చేసి పూర్తిచేస్తే.. స్వరా ష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభమైన పా లమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డుపుల్లలు వేసినా.. దాదాపు పూర్తిచేశామ ని, స్వల్ప పనులు చేస్తే పూర్తయ్యే ప్రాజె క్టును పడావు పెట్టిన ఘనత సీఎం రేవంత్‌ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఈసారి వరదలు బాగా వచ్చినా వినియోగించుకోక పోవడంతో నీరంతా సముద్రం పాలైందని తె లిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయి దు మెడికల్‌ కాలేజీలు నిర్మించి.. వైద్యాన్ని, వైద్య విద్యను చేరువ చేశామని, జేఎన్‌టీ యూ, ఫిషరీష్‌, అగ్రికల్చర్‌ బీఎస్సీ కాలేజీల ను మంజూరు చేశామన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి.. ఈ ప్రాం తానికి ఉన్న మంచిపేరును చెడగొడుతున్నా రని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హ యాంలో రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేశామని, ఇప్పుడు ధాన్యం, పత్తి కొనుగోలు చేయకపోవడంతో రైతులు గోస పడుతున్నా రని తెలిపారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరు వులను బాగు చేయడంతోపాటు.. ఊకచెట్టి వాగు, కందూరు పెద్దవాగులపై 32 చెక్‌డ్యాం లు నిర్మించి.. భూగర్భజలాలను పెంచామని అన్నారు. వ్యవసాయాన్ని కేసీఆర్‌ పండుగలా చేస్తే.. రేవంత్‌ దాన్ని నాశనం చేస్తున్నారని అ న్నారు. వరంగల్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం తక్కువ చేయలేదని అంటున్న రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ కిట్‌, రైతుబంధు, న్యూట్రీషన్‌ కిట్‌, చేపపిల్లలు, రెండో విడత గొర్రె పిల్లల పంపిణీ, దళితబంధు, బీసీబంధు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమ లు చేయడం లేదని, మహిళలకు రూ. 2500 భృతి, రూ. 4వేల పింఛన్‌, రైతు భరోసా కింద రూ. 15వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు సాయం, అన్ని పంటల కు బోనస్‌ను మరిచిపోయారని ఆరోపించారు. ఇక్కడ రూ. 2500 ఇవ్వలేదు కానీ.. మహా రాష్ట్రకు పోయి అక్కడ రూ. 3వేలు ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మ హిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందడం లేదన్నారు. కురుమూర్తి స్వామి మీద ఒట్లు పెట్టి.. పంద్రాగష్టులోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించి.. ఇప్పటివరకు పూర్తిచేయలేదన్నారు. హామీ సమయంలో రూ. 41వేల కోట్లు మాఫీ చేస్తామని, తర్వాత దాన్ని రూ. 36వేల కోట్లకు, బడ్జెట్‌లో రూ. 26వేల కోట్లు పెట్టి.. రూ. 17వేల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు. రూ. 2ల క్షల పైన ఉన్న వారు మిగతా సొమ్ము అప్పు తెచ్చి కట్టి మాఫీ కోసం ఎదురుచూస్తున్నారని, తెచ్చిన అప్పుకు వడ్డీ పెరుగుతుందే కానీ మా ఫీ మాత్రం కావడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ హ యాంలో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరి రైతుబంధు వేశామని, ఇప్పుడు అది పడటం లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడ్డ మొత్తం కూడా.. ఎన్నికల సమయంలో బీ ఆర్‌ఎస్‌ పాస్‌ చేసిన బడ్జెట్‌ను అప్పుడు అడ్డు కున్నదేనని గుర్తుచేశారు. 2014కు ముందు రాష్ట్రంలో 30లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండితే.. ప్రస్తుతం 1.59లక్షల ధాన్యం పండు తోందని అన్నారు. కేసీఆర్‌ హయాంలో కల్యాణలక్ష్మి పథకం కింద 13లక్షల పేదింటి ఆడపిల్లలకు రూ. 11వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పౌరసరఫ రాల మంత్రి 90లక్షల ధాన్యం కొంటామని చెబుతుండగా.. కమిషనర్‌ 70లక్షల టన్నులు అంటున్నారని, ఇప్పటివరకు 15లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. 25ల క్షల మెట్రిక్‌ టన్నుల పత్తి కొనుగోలు చేయాల్సి ఉండగా.. లక్ష టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ధర కూడా తక్కువగా వస్తోందని తెలిపారు. ఆలోచన చేసుకుని, ఆత్మవిమర్శ చేసుకుని పరి పాలన అందించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమా ర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:19 PM