గోవింద నామస్మరణతో మారుమోగిన పాలమూరు
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:10 PM
గోవింద నామస్మరణ పాలమూ రు పట్టణంలోని టీచర్స్ కాలనీ, మెట్టుగడ్డ, పిల్లలమర్రి రోడ్డులోని సూర్యలక్ష్మి కాటన్మిల్లు వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు మారుమోగింది.
మహబూబ్నగర్ న్యూటౌన్ నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గోవింద నామస్మరణ పాలమూ రు పట్టణంలోని టీచర్స్ కాలనీ, మెట్టుగడ్డ, పిల్లలమర్రి రోడ్డులోని సూర్యలక్ష్మి కాటన్మిల్లు వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు మారుమోగింది. మంగళవారం కార్తీక ఏకాదశి పురస్క రించుకుని టీచర్స్ కాలనీలోని జగదాంబ ప్రాం తంలో గల శ్రీరామచంద్ర దేవాలయంలో స్వా మి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అ నంతరం ఆలయ ప్రాంగణం నుంచి భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పురవీధుల గుం డా స్వామి వారిని ఊరేగింపుగా తీసుకవెళ్లారు. ఈ సందరంగా భజనపరులు కీర్తనలు ఆల పించారు. భజనలు చేస్తూ స్వామివారికి గోవిం దలు కొడుతూ అత్యంత భక్త్తిశ్రద్ధలతో పాద యాత్ర నిర్వహించారు. పాదయాత్ర వెళ్తున్న ప్రాంతంలోని కాలనీల ప్రజలు వచ్చి స్వామివా రికి పూజలు నిర్వహిం చారు. పాదయాత్ర కాట న్మిల్లు వద్దగల వేంకటే శ్వర స్వామి ఆలయానికి చేరుకోగానే ఆలయ పూ జారులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆల య పూజారులు తీర్థ ప్ర సాదాలు అందించారు. టీచర్స్ కాలనీకి చెందిన ఆలయ కమిటీ సభ్యులు మెట్టుకాడి శ్రీనివా సులు, శ్యాంసుందర్, ఆలయ పూజారి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.