Share News

బిల్లులు త్వరగా చెల్లించాలి

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:35 PM

అమ్మ ఆదర్శ పాఠశా ల పథకంలో భాగంగా ప్రభుత్వ బడుల్లో పూర్తి చేసిన పనులకు బిల్లులు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ సురభి ఆదేశించారు.

బిల్లులు త్వరగా చెల్లించాలి
అధికారులతో మాట్లాడుతున్న వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : అమ్మ ఆదర్శ పాఠశా ల పథకంలో భాగంగా ప్రభుత్వ బడుల్లో పూర్తి చేసిన పనులకు బిల్లులు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌ శాఖ, ఈడబ్ల్యూఐడీసీ అధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలోని అంగన్‌వాడీ కేం ద్రాలకు సంబంధించి ఇప్పటికే మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈడబ్ల్యూఐడీసీ శాఖకు కేటాయించిన 19 అంగన్‌ వాడీల్లో మరుగుదొడ్ల పనులు నేటికీ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. సెప్టెంబ రు నెలలో వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులకు పంచాయతీ రాజ్‌, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో మరమ్మతులు వేగంగా పూర్తి చేసి యూసీ సమ ర్పించాలన్నారు. రోడ్ల మరమ్మతుల విషయంలో అలసత్వం వహించ రాదని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో పూర్తి చేసిన పనులకు సంబం ధించిన బిల్లులు త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ కార్యనిర్వాహక ఇంజనీరు మల్లయ్య, ఈడబ్ల్యూ ఐడీసీ డీఈ, ప్రణాళిక అధికారి భూపాల్‌ రెడ్డి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:35 PM