Share News

కాసులిస్తేనే కార్డు!

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:29 PM

జోగుళాం బ గద్వాల జిల్లా కేంద్రంలోని కార్మికశాఖలో కాసులిస్తే కార్మికులు కాకున్నా లేబర్‌ కార్డులు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

కాసులిస్తేనే కార్డు!
శిథిలావస్థలో ఉన్న భవనంలోనే కొనసాగుతున్న కార్మికశాఖ కార్యాలయం

- కార్మికశాఖలో దళారుల దందా

- పైసలిస్తే కార్మికులు కాకపోయినా కార్డులు

- గద్వాల జిల్లాలో 73,151 మంది కార్మికులు

-చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

- క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే జారీ

జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో కొంతకాలంగా దళారులు రాజ్యమేలుతున్నారు. ఇక్కడ కాసులిస్తే ఏపనైనా చేస్తారనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని కార్యాలయాలలోకి వెళ్లి చూస్తే విషయం అర్థమవుతోంది. నిరుపేదలను ఆసరా చేసుకొని కొందరు దళారులు సంఘాల పేరు చేప్తూ కార్యాలయాల్లో హావా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కార్యాలయ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు సమాచారం.

గద్వాల క్రైం, ఆక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జోగుళాం బ గద్వాల జిల్లా కేంద్రంలోని కార్మికశాఖలో కాసులిస్తే కార్మికులు కాకున్నా లేబర్‌ కార్డులు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ లేబర్‌ కార్డులు అంగ ట్లో వస్తువులుగా మారాయి. కొందరు యూనియన్‌ నా యకులు దళారుల ముసుగులో వారు చెప్పితేనే కార్డు లు ఇవ్వాలనేలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపి స్తున్నాయి. దీంతో కార్మికులు కానివారు కూడా లేబర్‌ కార్డులు తీసుకొని ప్రభుత్వం అందించే సౌకర్యాలు పొందుతున్నారు. జిల్లాలో 2009 నుంచి మొదలుకొని ఇప్పటివరకు మొత్తం భవన నిర్మాణ కార్మికులు 73,151 మంది ఉన్నట్లు ఆధికారులు చెబుతున్నారు. ఇందులో కార్మికులు కానివారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అందించే పథకాలు 9,367 మంది లబ్ధిపొందారు. ఇందులో కూడా మెటర్నరీకి సంబంధించి 6,410 మంది, పెళ్లిళ్లకు సంబంధించి 2,267 మంది, సాధారణ మరణాలకు సంబంధించి 637 మంది, ప్రమాదాలకు సంబంధించి 48 మంది, దివ్యాంగులకు సంబంధించి ఐదుగురు లబ్ధిపొందారు. వీరికి మొత్తం క్లైమ్‌ రూపంలో రూ. 37,25,39,324 మంజూరు చేశారు. 170 మందికి సంబంధించిన క్లైమ్స్‌ పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

దళారులే రాజ్యమేలుతున్నారా?

జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ కార్యాలయంలో అధికారులు సమయానికి వస్తారో లేదో కానీ అక్కడ నిత్యం కనపడేది దళారులే. కార్మికులు కానివారితో ఒక్కో కార్డుకు రూ. 800 నుంచి రూ. 1000 తీసుకువచ్చి మేము పలానా సంఘం నాయకులమని చెప్పుకొని కార్డులు జారీ చేయిస్తున్నారు. ఇందులో రూ. 200 నుంచి రూ. 300 వరకు కార్యాలయ సిబ్బందికి ముట్టజెపుతున్నా రనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేబర్‌ కార్డుతో పాటు బీమా సొమ్ము క్లైయిమ్‌కు ఒక్కో ధర నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా లేబర్‌ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం నుంచి ప్రమాద బీమా రూ. 6 లక్షలు, సాధారణ మరణానికి రూ. 1.30లక్షలు ఇలా వచ్చే పథకాలలో దళారులు చేతివాటం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా లేబర్‌ కార్డులు తీసుకున్న వారిలో అధికంగా అనర్హులు ఉన్నట్లు సమాచారం. ఈ తతంగం అంతా లేబర్‌ కార్యాలయంలో పనిచేసే ఓ సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

శిథిలావస్థ భవనంలోనే కార్యాలయం

జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఐడీవోసీ కార్యాలయంలోకి లేబర్‌ కార్యాల యాన్ని మార్చకుండా శిథిలావస్థలో ఉన్న భవ నంలోనే ఎందుకు నిర్వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నూతన కార్యాలయంలోకి అధికా రులు సమయపాలన పాటించాల్సివస్తుందని, దళారులు తగ్గుతారనే పాత భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Oct 22 , 2024 | 11:29 PM