తక్షణమే ప్రజల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 11 , 2024 | 10:53 PM
పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
వనపర్తి క్రైమ్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదుదా రులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలు సుకున్నారు. సంబంధిత మండలాల ఎస్‌ఐలు ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. చి న్న సమస్యలను పోలీస్ స్టేషన్‌లోనే కేసులు లే కుండా పరిష్కారం చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. మొత్తం ప్రజావాణికి పది ఫిర్యా దులు వచ్చినట్లు తెలిపారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా : ప్రజావాణి ద్వారా అం దిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచిం చారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమా వేశ మందిరంలో నిర్వహించిన ప్రజావా ణిలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జడ్పీ సీఈవో యాదయ్యలతో కలిసి ప్రజల నుంచి క లెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 50 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ అధికారు లు తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జి ల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.