Share News

పోలీసు వృత్తికి గౌరవం తేవాలి

ABN , Publish Date - Oct 16 , 2024 | 12:03 AM

పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తిం చి పోలీసు వృతికి గౌరవం తీసుకు రావాలని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు.

 పోలీసు వృత్తికి గౌరవం తేవాలి
కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులతో మాట్లాడుతున్న ఎస్పీ గిరిధర్‌

కొత్తకోట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తిం చి పోలీసు వృతికి గౌరవం తీసుకు రావాలని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం కొత్తకోట పోలీస్‌ ష్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సై చాంబర్‌లో పోలీసులతో మాట్లాడుతూ చట్టాన్ని అమలు చేస్తూ ఆదర్శంగా నిలువాలన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ఆర్థిక నేరాలను కట్టడి చేయడానికి సీసీ కెమెరాలను అమర్చుకోవడానికి ప్రజలను చైతన్యనం చేయాలన్నారు. 100 డయల్‌ కాల్‌ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి సిబ్బంది చేరుకోని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టా లన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మధ్య తాగే వారిపై కేసు నమోదు చేయాలన్నారు. అంతకు ముందు స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. ఎస్సీ వెంట డీఎస్పీ వెంకటే శ్వర్‌రావు, ఇన్‌చార్జి సీఐ శివ కుమార్‌, ఎస్సై మంజునాథ్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Oct 16 , 2024 | 12:03 AM