మహబూబ్‌నగర్ డీఈవోగా ప్రవీణ్‌కుమార్
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:27 PM
మహబూబ్‌నగర్ ఇన్‌చార్జి డీఈవోగా వికారాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్ డైరక్టర్ ఎ.ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఈ.వెంకటనర్సింహారెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.
గద్వాల జిల్లాకూ ఆయనే
ఇన్‌చార్జి విద్యాధికారికి అన్నీ సవాళ్లే..
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబరు 12: మహబూబ్‌నగర్ ఇన్‌చార్జి డీఈవోగా వికారాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్ డైరక్టర్ ఎ.ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఈ.వెంకటనర్సింహారెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. మహబూబ్‌నగర్‌తో పాటు అదనంగా జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి డీఈవో బాధ్యతలు కూడా అప్పగించారు. మ హబూబ్‌నగర్ మాజీ ఇన్‌చార్జి డీఈవో ఎ.రవీందర్ గత గురువారం ఓ ఉపాధ్యాయురాలి సీనియారిటీ జాబితా విషయంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడిన విషయం తెలిసిందే.
ఇవీ సమస్యలు..
మహబూబ్‌నగర్ ఇన్‌చార్జి డీఈవోగా నియమితులైన ప్రవీణ్‌కుమార్ ముందు అన్నీ సవాళ్లే ఉన్నాయి. పాలమూరు జిల్లాలో గతంలో జరిగిన ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్ల, ప్రైవేట్ స్కూ ల్స్‌కు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇవ్వడం తదితర సమస్యలు ఎదురుకానున్నాయి. బదిలీల సందర్భంగా ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు స్పౌజ్ పాయింట్ల విషయంలో చేసిన తప్పిదాలపై చర్యలు తీసుకోకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిళ్లు రానున్నాయి.