Share News

యాసంగి సాగుకు సన్నద్ధం

ABN , Publish Date - Nov 09 , 2024 | 12:01 AM

జోగుళాంబ గద్వాల, వనప ర్తి జిల్లాలో యాసంగి సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు.

యాసంగి సాగుకు సన్నద్ధం
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో సాగుచేసిన పప్పుశనగ

- గద్వాల జిల్లాలో సాగు అంచనా 1.30 లక్షల ఎకరాలు

- వనపర్తి జిల్లాలో 1,31,876 ఎకరాలు

- ఈ ఏడాది పెరుగనున్న వరి, మొక్కజొన్న , పొగాకు

- అందుబాటులో ఎరువులు, విత్తనాలు

గద్వాల/వనపర్తి అర్బన్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల, వనప ర్తి జిల్లాలో యాసంగి సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. వ్యవసాయ అధికారు లు కూడా ఎరువులు, విత్తనాలు అందించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గద్వాల జిల్లాలో సుమారు 1.30లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా 28,763 క్వింటాళ్ల విత్తనాలు, 34,280 మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచారు. వనపర్తి జిల్లాలో 1,31,876 ఎకరాలలో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశా రు. ఈ ఏడాది పత్తి మినహా అన్ని పంట లు ఆశాజనంగా దిగుబడులు వస్తున్నాయి. యాసంగిలో కూడా పంటలు బాగా పండుతాయని రైతులు ఆశతో సాగుచేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో యాసంగి పంటకు కావాల్సిన నీరు అందుబాటులో ఉండటంతో గద్వాల జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది వరిసాగు పెరిగే అవకాశం ఉంది. గతేడాది 52వేల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది 61వేల ఎకరాలలో సాగు అవుతోందని అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 19,272 ఎకరాల్లో, జొన్న 3,402 ఎకరాలు, పొగాకు 5,200ఎకరాలు, వేరుశనగ 12,850ఎకరాలు, పప్పుశనగ 13,731 ఎకరాలు, మినుములు 5,203 ఎరాలు, కందులు 350 ఎకరాలు, ఆముదం 182 ఎకరాలు, అలసందలు 859ఎకరాలు, కొర్రలు 260ఎకరాలు, కూరగాయలు 5,907 ఎకరాలు, ఇతర పంటలు సాగుచేసే అవకాశం ఉందని అధికారుల అంచనా.. గద్వాల జిల్లాలో యాసంగికి యూరియా 10,220 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 4,990, పొటాష్‌ 1,850, కాంప్లెక్స్‌ ఎరువులు 14,890, సూపర్‌ ఫాస్పేట్‌ 1,750 ఇలా మొత్తం 34,280 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసి అందుబాటు లో ఉంచారు.

వనపర్తి జిల్లాలో భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావుల్లో నీరు పుష్కలం గా లభిస్తుంది. దీంతో యాసంగిలో 1,31,876 ఎకరాలలో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. వరి 98,355 ఎకరాలు, వేరుశనగ 18,770, మి నుములు 12,741, పప్పుశనగ 440, మొక్కజొన్న 496, జొన్న 409, ఇతర పంటలు 665 ఎకరాలలో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ పంటలకు 20,170 టన్నుల యూరియాతో పాటు డీఏపీ 7,746 టన్నులు, పొటాష్‌ 4,352 టన్నులు, కాంప్లె క్స్‌ ఎరువులు 13,333 టన్నులు, సింగిల్‌ సూపర్‌ ఫాస్పెట్‌ 1,843 టన్నులు, మొత్తం 47,444 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచా రు. ఇప్పటికే వేరుశనగ, పప్పు శనగ, మొక్కజొన్న, ఆముదం తది తర పంటలు సాగు చేశారు. డిసెంబరులో వరి సాగు చేసేం దుకు రైతులు సిద్ధమవుతున్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:01 AM