Share News

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:30 PM

రోడ్డు ప్రమాదాల నియంత్ర ణలో ప్రతీఒక్కరు భాగస్వామ్యం కావాలని అ ప్పుడే ప్రమాదాల సంఖ్యను తగ్గించగలుగుతా మని ట్రాఫిక్‌ నిబంధనలు వాహనదారుల సౌక ర్యం, రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చే సినవని, ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించా లని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రావుల గిరిధర్‌

వనపర్తి రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాల నియంత్ర ణలో ప్రతీఒక్కరు భాగస్వామ్యం కావాలని అ ప్పుడే ప్రమాదాల సంఖ్యను తగ్గించగలుగుతా మని ట్రాఫిక్‌ నిబంధనలు వాహనదారుల సౌక ర్యం, రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చే సినవని, ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించా లని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు. బుధవారం వనపర్తి పట్టణ కేంద్రంలోని రావూస్‌ జూనియర్‌ కళాశాలలో వనపర్తి ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యం లో ట్రాఫిక్‌ ఉల్లంఘన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలకు అనేక రకాల కారణాలుంటాయని ఇందులో ప్రధానంగా మ ద్యం తాగి వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ నిబంఽ దనలపై అవగాహన లేకపోవడం లాంటివి ప్రఽ దాన కారణాలని చెప్పారు. అలాగే జిల్లాలో చా లా మంది వాహనదారులు తమ వాహనాలకు నంబర్‌ ప్లేట్స్‌ లేకుండా వాహనాలపై ప్రయా ణిస్తున్నారని అది చట్టరీత్యా నేరమని ఇకనైనా తమ వాహనాలకు నంబర్‌ ప్లేట్స్‌ ప్రభుత్వం ని ర్దేశించిన విధంగా ఉండాలని లేకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఎస్పీ అన్నారు. వాహనాలకు నెంబర్‌ ప్లేట్‌ లేకుండా ప్రయా ణించడం నేరమన్నారు. విద్యార్థులు ప్రయాణం సాఫీగా సాగడానికి రోడ్లపై నిలబడి విధులు ని ర్వహించే ట్రాఫిక్‌ పోలీసులకు ప్రతీఒక్కరు స హకరించాలన్నారు. షీ టీమ్‌లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హె చ్చరించారు.

కార్యక్రమంలో వనపర్తి సీఐ, క్రిష్ణ, వనపర్తి పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌, ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐ సురేందర్‌, ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ నిరంజన్‌, రావూస్‌ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:30 PM