Share News

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:33 PM

గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డి మాండ్‌ చేశారు.

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న పుట్ట ఆంజనేయులు

వనపర్తి రూరల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డి మాండ్‌ చేశారు. గురువారం వనపర్తి పట్టణ కేం ద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా ఆఫీ స్‌ బేరర్స్‌ సమావేశం రాజు అధ్యక్షతన నిర్వహి ంచారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయ తీ కార్మికులు డిసెంబరు 27, 28 తేదీల్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని టోకెన్‌ సమ్మె జరుగుతు ందని అన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులంతా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగు తున్న టోకెన్‌ సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిక్సన్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:33 PM