సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:16 PM
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు శుక్ర వారం మక్తల్ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
- పంచాయతీ కార్మికుల డిమాండ్
- పరిషత్ కార్యాలయాల ముందు ధర్నా
మక్తల్/నర్వ/దామరగిద్ద/మద్దూర్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు శుక్ర వారం మక్తల్ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కిరణ్, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహా, జిల్లా నాయకుడు నరేష్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సదు పాయాలు కల్పించాలని, పదవీ విరమణ సమయంలో రూ.ఐదు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు వెంకటయ్య, చంద్రప్ప, నర్సిములు, లక్ష్మమ్మ, సాయప్ప, లక్ష్మయ్య, నర్సిములు, మల్లేష్, అంజి, మహేష్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, నర్వ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె చేపట్టారు. సమ్మెనుద్ధేశించి టీఐసీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్ మా ట్లాడారు. సంఘం మండల అధ్యక్షుడు గొల్ల రాంచంద్రి, నాయకులు నర్సిములు, నర్సోజి, శ్రీను, చారి, కేశవులు, ఆనంద్, సామేలు, ఎల్లప్ప, కడుపన్న, రాము తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్దలోని పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు నిర్వహించిన టోకెన్ సమ్మెలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్, సీఐటీయూ నాయకుడు జోషి, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సిములు, కార్మికులు పాల్గొన్నారు.
మద్దూర్‌లో పరిషత్ కార్యాలయం ఎదుట నిర్వహించిన సమ్మెలో కార్మికులు ఎంపీడీవో నర్సింహారెడ్డికి వినతిపత్రం అందించారు. కార్మిక సంఘం నాయకులు పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. టీయూసీఐ అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సిములు, కార్మికులు భీములు, రాములు, గోవింద్ దస్తప్ప, మొగులప్ప, మౌలానా, మహిమూద్ తదితరులున్నారు.