Share News

ప్రజాపాలన విజయోత్సవాలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:42 PM

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజలు మెచ్చే సంక్షేమ పథకాలను అమ లు చేస్తూ.. ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్య ంలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అ న్నారు.

ప్రజాపాలన విజయోత్సవాలు
పరుగు తీస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజలు మెచ్చే సంక్షేమ పథకాలను అమ లు చేస్తూ.. ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్య ంలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అ న్నారు. సోమవారం ప్రజా పాలన విజయోత్స వాల సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో బాలుర జూనియర్‌ కళాశాల మైదా నం నుంచి 2కె రన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్ట ర్‌ సంచిత్‌ గంగ్వార్‌ హాజరై జెండా ఊపి పరుగు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి తెల ంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు చూరగొంటుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రజా పా లన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రజా పాలన విజ యోత్సవాల సందర్భంగా డిసెంబరు 9వ తేదీ వ రకు రోజు వివిధ కార్యక్రమాలను నిర్వహిం చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన 2కె రన్‌ ఆర్డీవో ఆఫీస్‌ వర కు చేరుకొని, తిరిగి బాలుర కళాశాల మైదా నానికి చేరుకొని ముగింపు జరిగింది. 2కె రన్‌లో విద్యార్థులు, యువకులు, పోలీసులు, అధికా రులు, ప్రజలు తదితరులు పాల్గొని ఉత్సాహంగా పరుగు తీశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య చైర్మన్‌ గోవర్ధన్‌ సాగర్‌, డీఎస్పీ వెంకటేశ్వ ర్లు, ఆర్‌డీవో సుబ్రహ్మణ్యం, డీవైఎస్‌వో సుధీర్‌ రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌, రమే ష్‌ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Updated Date - Dec 02 , 2024 | 11:42 PM