Share News

మార్చి వరకు కొనుగోళ్లు

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:32 PM

రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, పంట దిగుబడికి అనుకూలంగా మార్చి వరకు సీసీఐ కొనుగోళ్లు ఉంటా యని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ స్పష్టం చేశారు.

మార్చి వరకు కొనుగోళ్లు
సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ బీఎం సంతోష్‌

మిల్లు సామర్థ్యానికి తగ్గట్టుగా టోకెన్లు ఇవ్వాలి

తేమ లేకుంటేనే పత్తికి సరైన ధర లభిస్తుంది

అలంపూర్‌ చౌరస్తా, నవంబరు 19, (ఆంధ్రజ్యోతి) : రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, పంట దిగుబడికి అనుకూలంగా మార్చి వరకు సీసీఐ కొనుగోళ్లు ఉంటా యని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ స్పష్టం చేశారు. ఉండ వల్లి మండలంలోని వరసిద్ధివినాయక కాటన్‌ మిల్లు లో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మం గళవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రా నికి రైతులు తెచ్చిన పత్తి తేమ శాతాన్ని పరిశీలించా రు. నిబంధనల ప్రకారం పత్తిని తెస్తేనే సరైన ధర లభిస్తుందని తెలిపారు. మిల్లును పరిశీలించిన ఆనం తరం అయన మిల్లు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కొనుగోలు కేంద్రం వద్ద రద్దీ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం మిల్లు సామర్థ్యానికి తగ్గట్లుగానే టోకెన్లు జారీ చేయాలని అదేశించారు. రైతులకు ఇచ్చిన తేదీలలోనే పత్తిని తీసుకువచ్చేలా రైతులకు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇందుకు జాబితా సిద్ధం చేసి ఉంచుకో వాలని, టోకెన్లు ఉన్న రైతుల పత్తిని మాత్రమే అను మతించాలని అదేశిం చారు. రైతులేవరు తొందర పడొద్దని, నిర్ణయించిన తేదీలలో మాత్రమే రావాలని, మార్కెట్‌శాఖ జిల్లా అధికారి పుష్పమ్మ తెలిపారు. అత్యవసరం ఉన్న రైతులు అడ్డాకుల వద్ద ఉన్న సీసీఐ కొనుగోలు కేం ద్రంలో విక్రయించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సంచాలకులు సక్రియనాయక్‌, అలంపూర్‌ మార్కెట్‌ చైర్మన్‌ దొడ్డప్ప, వైస్‌చైర్మన్‌ కొమ్ముకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:32 PM