Share News

గ ణేష్‌ ఉత్సవాలకు రెడీ

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:38 PM

జై బోలో గణేష్‌ మహరాజ్‌కి జై.. గణపతి బప్పా మోరియా అంటూ ఊరూవాడ గణేశుడి భక్తి గీతాలు మార్మోగనున్నాయి.

గ ణేష్‌ ఉత్సవాలకు రెడీ

- నేటి నుంచి ప్రారంభం కానున్న వేడుకలు

- జిల్లా వ్యాప్తంగా మండపాలలో కొలువుదీరనున్న గణేశులు

- భారీ పోలీస్‌ బందోబస్తు నిర్వహించనున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 6: జై బోలో గణేష్‌ మహరాజ్‌కి జై.. గణపతి బప్పా మోరియా అంటూ ఊరూవాడ గణేశుడి భక్తి గీతాలు మార్మోగనున్నాయి. అన్ని వర్గాల ప్రజలు భక్తిశ్రద్ధలతో ఉత్సవా లను జరుపు కోనున్నారు. శనివారం నుంచి గణేష్‌ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు మండపాలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. కొన్ని చోట్ల గణేశుడి విగ్ర హాలు మండపాలకు చేరుకున్నాయి. శనివారం భారీ సంఖ్యలో తరలించనున్నారు. నేటి సాయంత్రం నుంచి తొమ్మిది రోజులపాటు గణేశులు పూజలు అందుకోనున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం జిల్లా వ్యాప్తంగా 2,500 విగ్రహాలను ఏర్పాటు చేయను న్నట్లు సమాచారం. ప్రతీ గ్రామంలో 6-10 విగ్రహాలు, పట్టణాల్లో ప్రతీవార్డులో 10-15 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. పాలమూరు జిల్లాలోని అన్ని గ్రామాల్లో వాడవాడల్లో మండపాలను ఏర్పాటు చేస్తున్నారు.

కిటకిటలాడుతున్న డెకరేషన్‌, లడ్డూ దుకాణాలు

మండపాలను అందంగా తీర్చిదిద్దేందుకు భక్తులు ఎంత ఖర్చుకైనా వెనుకాడటంలేదు. డెకరేషన్‌ కు లక్ష లు ఖర్చుచేస్తున్నారు. రెండ్రోజులుగా పట్టణంలోని పాన్‌ చౌరస్తాలోని డెకరేషన్‌ షాపులు కిటకిటలాడుతున్నా యి. చవితి ఉత్సవాల లో లడ్డూకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. గణేశుడి చేతిలో లడ్డూ ఉంచి నిమజ్జనం రోజు న వేలం వేస్తారు. లక్షల్లో వేలం పాడి లడ్డూను దక్కించుకుం టారు. మహబూబ్‌ నగ ర్‌, జడ్చర్ల పట్టణాల్లో అన్ని స్వీట్‌హౌస్‌లతో పాటు ప్రధాన రహ దారి వెంట భారీగా లడ్డూలను విక్రయి స్తున్నారు. కిలో నుంచి 20-50 కిలోల లడ్డూల ను అందుబాటులో ఉంచారు. చవితి ఉత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందో బస్తును ఏర్పాటు చేస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద వినాయకుడు

- ఆవంచలో వెలసిన ఐశ్వర్య గణపతి

తిమ్మాజిపేట : నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండల ంలోని ఆవంచలో వెలసిన ఐశ్వర్య గణపతి దేశంలోని అతిపెద్ద వినాయకుడి విగ్రహంగా చెప్పుకుం టారు. క్రీస్తుపూర్వం 1175లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన పశ్చిమ చాళుక్యుల వంశస్థుడైన తైలంపుడు ఏకశిలపై 30 అడుగుల వినాయకుడి ప్రతిమను చెక్కించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దుందుభి నది ఒడ్డున ఊరికి సమీపంలో ఉన్న ఐశ్వర్య గణపతిని చవితి రోజున దర్శించుకునేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.

Updated Date - Sep 06 , 2024 | 11:38 PM