బాధిత మహిళలకు భరోసా
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:26 PM
బాధిత మహిళలకు రక్షణ కల్పించి, అండగా నిలబడేందుకు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు. చాలామంది మహిళలు, అన్యాయానికి గురైన బాలికలు పోలీస్ స్టేషన్‌లలో చెప్పుకోలేని సమస్యలను భరోసా కేంద్రాలలో చెప్పుకునేందుకు స్వేచ్ఛ ఉంటుందన్నారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి
మహబూబనగర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): బాధిత మహిళలకు రక్షణ కల్పించి, అండగా నిలబడేందుకు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు. చాలామంది మహిళలు, అన్యాయానికి గురైన బాలికలు పోలీస్ స్టేషన్‌లలో చెప్పుకోలేని సమస్యలను భరోసా కేంద్రాలలో చెప్పుకునేందుకు స్వేచ్ఛ ఉంటుందన్నారు. బాధితుల సమస్యలకు పరిష్కారం లభించడంతోపాటు న్యాయం జరుగుతుందని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో నూతనంగా ని ర్మించిన భరోసా కేంద్రాన్ని ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ డి.జానకితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక హంగులతో చక్కటి భవనాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇక్కడే షీటీమ్ కార్యా లయం కూడా ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తు చేశారు. అత్యాచారాలు, అఘాయిత్యాలకు గురైన మహిళలు, బాలికలకు, పోక్సో కేసు బాధితులకు ఈ సెంటర్ ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీ సుకుంటారన్నారు. బాధితులు ధైర్యం గా ఈ కేంద్రాలను ఆశ్రయించాలని సూచించారు. మెగా ఇన్ర్ఫాస్టక్చర్ కంపెనీ భరోసా సెంటర్‌ను రూ.2 కోట్లతో నిర్మించడం అభినందనీయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ భరోసా సెంటర్‌ను ఆశ్రయించే బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ బాఽధితులు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, సామాజిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, అడిషనల్ ఎస్పీ ఏ.రాములు నాయకులు, మల్లు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.