Share News

తిరుమలలో తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలను స్వీకరించాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:30 PM

తిరుమలలో తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడు అన్నారు.

 తిరుమలలో తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలను స్వీకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడు

- విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడు

గద్వాల న్యూటౌన్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడు అన్నారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ నాయకుడు బాసు హనుమంతు నాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తిరుమలలో ఉన్న వేంకటేశ్వరస్వామి దర్శనం విషయంలో ఎలాంటి తేడా లేకుండా జరిగేవని, కానీ ప్రస్తుతం తెలంగాణ భక్తు లు, రాజకీయ నాయకులపై వివక్ష చూపుతున్నారన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గతంలో కల్పిస్తున్న సౌకర్యాలను పునరుద్ధరించాలని కోరారు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు గద్వాల ప్రాంతం నుంచి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా ఉందన్న విషయం టీటీడీ అధికారులు గమనించాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రా ప్రాంతంలో ఉన్న ఏకైక సంబంఽధం తిరుపతి అని, గతంలో లాగానే ఇప్పుడు కూడా తిరుమలలో తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని డిమాండ్‌ చేసారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బాసు హనుమంతు నాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బాసు శ్యామల, నాయకులు కిశోర్‌, రవి ప్రకాష్‌గౌడు, మోనేష్‌, శేఖర్‌ నాయుడు, తిరుమలేష్‌, గంజిపేట రాజు, వీరేష్‌గౌడు, చంద్రన్న గౌడు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:30 PM