Share News

ఒక్కరోజులోనే చోరీ నగదు రికవరీ

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:31 PM

చోరీ చేసిన రూ. లక్ష నగదును పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఒక్కరోజులోనే కేసును ఛేదించి రూ. లక్ష నగదును రికవరీ చేసిననట్లు ఆదివారం పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ తెలిపారు.

ఒక్కరోజులోనే చోరీ నగదు రికవరీ

- నిందితురాలు అరెస్ట్‌

గద్వాల క్రైం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): చోరీ చేసిన రూ. లక్ష నగదును పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఒక్కరోజులోనే కేసును ఛేదించి రూ. లక్ష నగదును రికవరీ చేసిననట్లు ఆదివారం పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని సుంకులమ్మ మెట్టు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించుకుంటున్న మహిళ నుంచి మరో మహిళ రూ. లక్ష చోరీ చేసిన సంఘటనపై శనివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి బాధితురాలు కుర్వ కిష్టమ్మ ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో తమ పొలానికి చెందిన క్రాఫ్‌లోన్‌కు సంబంధించి రూ. లక్ష నగదును తీసుకొని కొద్దిగా అనారోగ్య సమస్య ఉండటంతో సుంకులమ్మ మెట్టు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లింది. చికిత్స నిర్వహించుకుంటున్న సమయంలో తన దగ్గర డబ్బులతో ఉన్న సంచి మాయమైంది. ఈ చోరీపై నిఘా ఉంచిన పట్టణ పోలీసులు సాంకేతిక కారణాలతో చోరీ జరిగిన విషయాలను గమనించారు. చోరీకి పాల్పడింది గద్వాల మండలంలోని సంగాల గ్రామానికి చెందిన పద్మమ్మగా గుర్తించారు. వెంటనే సంగాలకు వెళ్లి నిందితురాలని అరెస్ట్‌ చేయడంతో పాటు ఆమె చోరీ చేసిన రూ. లక్షను రికవరీ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే కేసు నమోదు అయిన ఒక్క రోజులోనే నిందితులను పట్టుకోవడంతో పాటు పూర్తి నగదును రికవరీ చేయడంతో బాధితులు ఎస్‌ఐకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Dec 29 , 2024 | 11:31 PM