Share News

బియ్యం నాణ్యత లేకుంటే వాపస్‌

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:17 PM

వసతి గృహాలకు సరఫరా చేసే బియ్యం, కూర గాయలు, ఇతర సరకులు నాణ్యత లేకుంటే తీసుకో వద్దని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశిం చారు.

బియ్యం నాణ్యత లేకుంటే వాపస్‌

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రూరల్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాలకు సరఫరా చేసే బియ్యం, కూర గాయలు, ఇతర సరకులు నాణ్యత లేకుంటే తీసుకో వద్దని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశిం చారు. శనివారం ఉదయం వనపర్తి పట్టణంలోని గిరిజన సంక్షేమ కళాశాల వసతి గృహం, ఐజయ్య కాలనీలోని ప్రభుత్వ షెడ్యూల్డ్‌ కులాల బాలుర వసతి గృహం, కళాశాల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఫుడ్‌ సూపర్‌వైజర్‌, విద్యార్థుల మెస్‌ కమి టీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు వండే బియ్యం, కూరగాయలు, ఇతర సరకులను కలెక్టర్‌ పరిశీలించారు. సరకులు వచ్చి నప్పుడు మెస్‌ కమిటీ సభ్యుల సంతకాలు రిజిస్టర్‌ లో తీసుకోవాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్ద న్నారు. బియ్యం కానీ కూరగాయలు బాగలేకుంటే తిరిగి పంపించాలని సూచించారు. పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, ప్లేట్లు, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కునే విధంగా సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. స్టాక్‌ రిజిస్టర్‌ నిర్వహించాలని, వాటిలో ఫుడ్‌ సూపర్‌ వైజర్‌తో పాటు మెస్‌ కమిటీ సభ్యుల సంతకాలు ఉండాలని ఆదేశించారు. రిజిస్టర్‌ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార నాణ్యత బాధ్యతలను ఫుడ్‌ సూపర్‌వైజర్‌ చూసుకోవాలని, తేడా వస్తే బాధ్యత వహించాలని ఆదేశించారు. ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహ విద్యార్థులతో కలెక్టర్‌ మాట్లాడారు. భోజనం బాగుం దని, భోజనశాల లేక ఆరుబయట భోజనం చేస్తు న్నామని విద్యార్థులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. స్పం దించిన కలెక్టర్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ రమేష్‌ రెడ్డి, డీసీవో తిరుపతయ్య, మన్నాన్‌, ప్రిన్సిపాల్‌, హాస్టల్‌ వార్డెన్‌ రాజు ఉన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:17 PM